Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14410

సకలపురాణములు చాటి నినుఁ బొగడఁగా

రాగము: లలిత

సకలపురాణములు చాటి నినుఁ బొగడఁగా
తకమకలుగా నల్పార్థము చెప్పఁదగునా॥పల్లవి॥
  
  
నిను నిర్గుణు డనేటి నీచజాతులయందు
యెనయు దుర్గుణము దా నెంతో
కనకంబు నిను మనుచు కారునాయంబులను
యెనలేనిదుర్వాదుల నేమనఁగఁగలము॥కల॥
  
  
నీవె తా మనుకొనేటి నిందితాత్ములు దాము
కావించుద్రోహంబు కడమా
దావతులఁ దనుఁగన్నతల్లి గొడ్డనిపల్కు
దేవతానిందకులఁ దెలుపంగ వశమా॥కల॥
  
  
అమరుసర్గము మిథ్య యనుశూన్యభాషులకు
తమితోడ భ్రమ యేల తరగు
తమగురువు శాస్త్రంబు తామె కల్లనఁ గాను
క్రమబుద్ధి శ్రీవెంకటనాథ యిత్తువా॥కల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!