Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14433

సడి సన్నయట్టి నెరజాణ నందువు

రాగము: సాళంగం

సడి సన్నయట్టి నెరజాణ నందువు
గొడవలు దీరఁ జెలిఁ గూడ రాదా రతుల॥పల్లవి॥
  
  
చిగురుఁబానుపుమీఁదఁ జెలి విరహనఁ బొంది
చిగురువంటిచేయి చెక్కునఁ బెట్టి
చిగురులోపలిచేగ చిత్తమునఁ బుట్ట దాయ
చిగురుఁబోణిని దయ్య నేయ రాదా విభుఁడ॥సడి॥
  
  
పూవులతోఁటలోన పొలఁతి తాపాన నుండి
పూవుల మొగ్గుల మేనఁ బులకించెను
పూవులలో పూఁపలు పుట్ట వాయ మాటలలో
పూవుఁబోణి నీవు గొంత బుజ్జగించ రాదా॥సడి॥
  
  
పండువెన్నెలబయట భామిని యలయుచునుండి
పండువంటిమోవివాఁడు బయల వేసె
పండుగలు గాఁగ నిట్టె బాపురె శ్రీవెంకటేశ
పండుజవ్వనిఁ గూడితి పవ్వళించ రాదా॥సడి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!