Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14435

సతతవిరక్తుఁడు సంసారి గాఁడు

రాగము: కన్నడగౌళ

సతతవిరక్తుఁడు సంసారి గాఁడు
రతిసమ్మదుఁడు విరక్తుఁడు నితఁడె॥పల్లవి॥
  
  
నిత్యుఁడైనవాఁడు నిఖిలలోకములఁ-
బ్రత్యక్షవిభవ సంపన్నుఁడు గాఁడు
నిత్యుఁడు నితఁడే నిరుపమానుఁడైన
ప్రత్యక్షవిభవ సంపన్నుఁ డితఁడె॥సత॥
  
  
యోగియైనవాఁడు వొనర నేకాలము
భోగియై భోగిపై భోగింపలేఁడు
యోగియు నితఁడే వుడుగక భోగిపై
భోగించునటువంటి పురుషుండు నితఁడె॥సత॥
  
  
దేవుడైనవాఁడుఁ దెలుప లోకముల
దేవతారాధ్యుఁడై దీపింపలేఁడు
దేవుఁడు నితఁడే దివిజవంద్యుఁడైన
శ్రీవేంకటగిరిదేవుండితఁడె॥సత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!