Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14439

సతికినిఁ బతికిని చలములేల

రాగము: నారాయణి

సతికినిఁ బతికిని చలములేల
రతివేడుకలనే రమించుట గాక॥పల్లవి॥
  
బింకములే తఱచైతే ప్రియములేరీతి మించు
జంకెనలెక్కుడైతేను శాంతములేవి
మంకులే మెరసితే మర్మములెట్టు గరఁగు
లంకెలై వొకరొకరు లాలించుట గాక॥సతికి॥
  
నాలితనము నేర్చితే ననుపులెక్కడ నుండు
తూలపోవ నాడితే సంతోసమేడది
కేలనే వొడ్డు కొంటేను క్రియలెట్టు సమకూరు
తాలిమితో నవ్వులను దైవారుటగాక॥సతికి॥
  
యెమ్మెలే మిక్కుటమైతే యియ్యకోలెట్ల నౌను
దొమ్ములే నెరపితే పొందులెట్లు గల్గు
కొమ్మ నిన్నలమేల్మంగ కూడె శ్రీవేంకటేశుఁడ
వుమ్మడి సరముల నోలాడుట గాక॥సతికి॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!