Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14521

సర్వాంతరాత్ముఁడవు శరణాగతుఁడ నేను

రాగము: లలిత

సర్వాంతరాత్ముఁడవు శరణాగతుఁడ నేను
సర్వాపరాధినైతి చాలుఁజాలు నయ్యా॥పల్లవి॥
  
  
వూరకున్న జీవునికి వొక్కొక్క స్వతంత్ర మిచ్చి
కోరేటి యపరాధాలు కొన్ని వేసి
నేరకుంటే నరకము నేరిచితే సర్గమంటా
దూరవేసే వింతేకాక దోష మెవ్వరిదయ్యా॥సర్మాం॥
  
  
మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులు చూపి
కనుఁగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి
ఘనము సేసే విందు గర్త లెవ్వరయ్యా॥సర్మాం॥
  
  
వున్నారు ప్రాణులెల్లా నొక్కనీ గర్భములోనే
కన్న కన్న భ్రమతలే కల్పించి
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసునయ్యా॥సర్మాం॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!