Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14551

సాగిన సబలలోన సరివారిలోన నెల్లా

రాగము: ఆహిరి

సాగిన సబలలోన సరివారిలోన నెల్లా
యీ గతి మన్నించితివి యీపెదె పో బ్రదుకు॥పల్లవి॥
  
  
చేయి వట్టి తీసి యింతిఁ జేరఁ బిలుచుకొంటివి
చాయల నిందరూఁ జూడఁ జాలదా యింత
పాయనిమోహ మెఱఁగి పై జేయి వేసి నేఁడు
యీ యెడ మన్నించితివి యీపెదెపో బ్రదుకు॥సాగిన॥
  
  
వంచిన చెలిశిరసు వడి నెత్తి పలికించి
చంచలించక నవ్వితి చాలదా యింత
కొంచ కాపెగుణములు కొనియాడి కొలువులో
యెంచి మన్నించితి విట్టె యీపెదెపో బ్రదుకు॥సాగిన॥
  
  
చెక్కు నొక్కి నిమ్మపండు చేతి కిచ్చి బుజ్జగించి
చక్కసరస మాడితి చాలదా యింత
దక్కిబి శ్రీవేంకటేశ తరుణి కౌఁగిటనే
యెక్కుడు మన్నించితివి యీపెదెపో బ్రదుకు॥సాగిన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!