Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14552

సాదించనేఁటికి నీవు సారెసారెకు

రాగము: దేసాళం

సాదించనేఁటికి నీవు సారెసారెకు
భేదములేక కూడితే పెనఁగులాడేమా॥పల్లవి॥
  
  
చెంగటనుండి నీవు చేసినదెల్లాఁ జేయఁగా
అంగనలము మాలో నేమాడుకోరాదా
సంగతిగా నీవు తొల్లె సాదువలె నుండితేను
పంగించి నిన్నటు భంగపరచవచ్చేమా॥సాదిం॥
  
  
వుడివోనిచిన్నలు నీవొళ్లిమీఁద నుండంగాను
నడుమ మాలో నేము నవ్వుకోరాదా
సడిలేని గుణముతో చక్కఁగా మెలఁగితేను
కొడిమెలు గట్టి నిన్ను కోపగించేమా॥సాదిం॥
  
  
కప్పి యందరివి నీవు కాఁగిలించకూడఁగాను
చొప్పులు మాలో నేము చూచుకోరాదా
యెప్పుడూ శ్రీవేంకటేశ యెడయక యేలితేను
తప్పులెంచి నీసుద్దులు తారుకాణించేమా॥సాదిం॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!