Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14632

సిగ్గువడి యిందాఁకా చెలువుఁడు నన్ను దూరె

రాగము: లలిత

సిగ్గువడి యిందాఁకా చెలువుఁడు నన్ను దూరె
బగ్గన మమ్మింతేసి పచ్చిసేతురా॥పల్లవి॥
  
  
అలవోకగా నీతో నాడుకొన్నమాటలెల్ల
వెలయఁగ నాతనితో విన్నవింతురా
చెలివంటా నాతనిచేఁత లిటువంటివంటే
చలపట్టి యంతలోనే సాదింతురా॥సిగ్గు॥
  
  
నగుతా నాతనిరచనలు నే సందేహించితే
సొగసి యాతనిమేను సోదింతురా
పగటున నావేళ పంతాలు నే మెరసితే
తగవు విడిచి మీరు తమకింతురా॥సిగ్గు॥
  
  
వద్దనుండి నే నాతనివలపులు వొగడితే
కొద్దిమీరి వెంగెములు కొనవేతురా
వొద్దికై శ్రీవేంకటేశుఁ డున్నతి నన్నుఁ గూడె
సుద్దులు తొల్లితి వింతే సూడువట్టుదురా॥సిగ్గు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!