Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14650

సింగారరాయుఁడ వౌదు చెన్నకేశా యింకఁ

రాగము: నాదరామక్రియ

సింగారరాయుఁడ వౌదు చెన్నకేశా యింకఁ
జెంగకుమీ మా రతుల చెన్నకేశా॥పల్లవి॥
  
  
చిమ్ములచుట్లతోనే చెన్నకేశా మాకు
చిమ్మిరేఁచేవు వలపు చెన్నకేశా
చెమ్మఁజెమటచెక్కుల చెన్నకేశా; మాపైఁ
జిమ్మకు గోళ్ళ నీవు చెన్నకేశా॥సింగా॥
  
  
సెలవిలేనగవుల చెన్నకేశా; మాకే
సెలవనెవు వయసు చెన్న కేశా
చెలఁగి పసిడిదట్టి చెన్నకేశా; యీ-
చెలువము నీకే చెల్లె చెన్నకేశా॥సింగా॥
  
  
చెప్పరానిమహిమల చెన్నకేశా మాకు
చెప్పిలేమోవి యిచ్చితి చెన్నకేశా
యిప్పుడే శ్రీవేంకటాద్రి నిందు మాచనవోలిలో
చెప్పఁగా నన్నేలితివి చెన్నకేశా॥సింగా॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!