Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14705

సెల్లునంటా నేమైన చేయవచ్చేవు నే-

రాగము: ముఖారి

సెల్లునంటా నేమైన చేయవచ్చేవు నే-
నొల్ల నిన్ను సక్కసాయ నుండేవో వుండవో॥పల్లవి॥
  
  
మేసవారి పిన్నదాని మేకుసేసి యింటిలోనఁ
దోసుకొంటివెఱఁగవా దుండగీఁడ
ఆసలఁ బెట్టేవు నన్ను నట్టనే యింతేసి
వేసాలఁబోక కొంగు వీడేవో వీడవో॥సెల్లు॥
  
  
పాయపు వలపులనే పైడివంటి గొల్లెతల
సాయంపంపి తొలఁగవా సటకాఁడ
మాయల- బెట్టుచు నీవు మంచునీరు కుంచాలఁ
బోయుచు నన్నేఁపక పోయేవో పోవో॥సెల్లు॥
  
  
గాఁటమైన గుబ్బల చక్కనిదాని నమ్మనంటా
ఆఁటదాని బాగొనేవడవిలోనే
నాఁటకపు వేంకటేశ నన్నుఁ గూడితివి యిట్టె
మాఁటనెందూనాడక మానేవో మానవో॥సెల్లు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!