Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14755

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: ముఖారి

సేసినదెల్లాఁ జేఁత చెల్లుఁబడాయ మీకు
వెూసులుగా నవ్వరాదా మోహమెల్లాఁ గంటిమి॥పల్లవి॥
  
  
దగ్గరనుంటే మీకు తమకము వుట్టుఁగాక
సిగ్గువ డెల్లంతనుంటే చింతరేఁగదా
యెగ్గులేదు పతితొడ యెక్కుక కూచుండఁగదే
వెగ్గళించి కాదనేమా వెరుపేల ఇఁకను॥॥
  
  
మొగములు చూచుకొంటే ముచ్చట లీడేరుఁగాక
నిగిడి తలవంచితే నిండదా కాఁక
తగవౌమగనితోను దట్టించి మాటాడఁగదే
జగడించేవా రున్నారా సటలేల ఇఁకను॥॥
  
  
ఇట్టె కాఁగిలించుకొంటే నితవులై వుండుఁగాక
గుట్టుననుంటే చెమట గుబులుకోదా
జట్టిగొని శ్రీ వేంకటేశ్వరుఁడు నన్నిటు గూడె
ఱట్టు కొత్తగా నయ్యెరా గుట్టేల ఇఁకను॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!