Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14850

హరి నీకే శరణని గెలుచుట గాక

రాగము: గుండక్రియ

హరి నీకే శరణని గెలుచుట గాక
యిరవుగ నెరఁగఁగ నెవ్వరి తరము॥పల్లవి॥
  
  
తను వికారములు తరవులు వెట్టిన
కొనయెరుకైనా కొరతవడు
మనసు వికారము మమతలఁ దగిలిన
యెనసి యెదురుపడ నెవ్వరి తరము॥హరి॥
  
  
కంతు వికారము కన్నులఁగప్పిన
పంతపు విరతియు బయలౌను
చింతాలహరులు చీఁదర రేఁగిన
యింతయు వీడ్కొన వెవ్వరితరము॥హరి॥
  
  
అతిగుణవికార మాసలఁ బెట్టిన
సతతయోగములు జడనుపడు
మతి శ్రీ వేంకటపతి నిన్నుఁ గొలిచిన
యితరము దగ్గర నెవ్వరితరము॥హరి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!