Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14891

హరి సేవొకటే యనంతము

రాగము: భవుళి

హరి సేవొకటే యనంతము
గురుబోధలకును కొలఁదే లేదు॥పల్లవి॥
  
  
తలఁచిన కొలఁదే తనలో భావము
నిలిపిన కొలఁదే నేమము
పలికిన కొలఁదే పరమగు సత్యము
యిల నెవ్వరికిని యెక్కుడు లేదు॥హరి॥
  
  
జరిపిన కొలఁదే సకలాచారము
నెరపిన కొలఁదే నిజకీర్తి
తిరము సేయుకొలఁదే ధర్మంబును
యిరవుగ నందుకు నెక్కుడు లేదు॥హరి॥
  
  
సేసినకొలఁదే చేకొను కర్మము
రోసిన కొలఁదే రుచివిరతి
ఆసల శ్రీవేంకటాధిపు శరణను
దాసుడే యెక్కుడు తప్పే లేదు॥హరి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!