Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3226

ఈతని దెంతప్రతాప మీతని దెంతవుదుటు

రాగము: సాళంగనాట

ఈతని దెంతప్రతాప మీతని దెంతవుదుటు
యీతఁడు రామునిబంటు యీతని సేవించరో॥పల్లవి॥
  
  
వుదయాస్త నగముల కొకజంగ చాఁచినాఁడు
చదివె రవితో సర్వ శాస్త్రములు
తుద బ్రహ్మాండము మోవఁ దోఁక మీఁది కెత్తినాఁడు
పెద పెద కోరల పెను హనుమంతుఁడు॥ఈతని॥
  
  
కుడిచేత దనుజులఁ గొట్ట నూఁకించినాఁడు
యెడమచేఁ బండ్లగొల పిడికిలించె
వుడుమండలము మోవ నున్నతిఁ బెరిగినాఁడు
బెడితపు మేనితోడఁ బెనుహనుమంతుఁడు॥ఈతని॥
  
  
పుట్టుఁ గవచ కుండలంబులతోడ నున్నవాఁడు
గట్టి బ్రహ్మపట్టానకుఁ గాచుకున్నాఁడు
ఇట్టే శ్రీ వేంకటేశు నెదుటఁ బనులు సేసీ
బెట్టిదపు సంతోసానఁ బెనుహనుమంతుఁడు॥ఈతని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!