Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3241

ఈతఁడు తారక బ్రహ్మమితఁడు మాదేవుఁడు

రాగము: సాళంగనాట

ఈతఁడు తారక బ్రహ్మమితఁడు మాదేవుఁడు
కౌతుకానఁ జెప్పే వినఁగదరే వో జనులు॥పల్లవి॥
  
  
రాముఁడు యిందీవరశ్యాముఁడు నానాసార్వ-
భౌముఁడు షోడశకళాసోముఁడు
దోమటిరాక్షసులను తుత్తుమురు సేసినాఁడు
కామితఫలములిచ్చి కాచినాఁడు సురల॥ఈతఁ॥
  
  
పూర్ణుఁడు నీలమేఘవర్ణుఁడు దానమున వి-
స్తీర్ణుఁడు వాహనసువర్ణుఁడు
అర్ణవము దాఁటి రావణాదుల గెలిచినాఁడు
నిర్ణయించి చెప్పరాదు నేఁడీతని మహిమ॥ఈతఁ॥
  
  
వరుఁడు సీతకు పరాత్పరుఁడు కోదండదీక్షా-
గురుఁడు దివ్యామోఘశరుఁ డితఁడు
నిరతి శ్రీవేంకటాద్రి నెలవై యుండేటివాఁడు
సరి భరతలక్షణశత్రుఘ్న సహితుఁడు॥ఈతఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!