Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3250

ఈతఁడె నీ కెంత చన విచ్చెనో కాక

రాగము: దేవగాంధారి

ఈతఁడె నీ కెంత చన విచ్చెనో కాక
యేతుల నీ గుణముల కిందరూను మెత్తురా॥పల్లవి॥
  
  
పదరి యాతడు నిన్నుఁ బైపైఁ బిలువఁగాను
యెదిటికి రావు లోన నేమి సేసేవే
మదిఁ గోపము గలితె మాటల నాడుదు గాక
కదిసి మోనాన నుంటే గర్వ మనరా॥ఈతడె॥
  
  
అలరి మాటాడి యాడి యాతఁడు లేప వచ్చితే
యెలమి నిద్దుర బొయ్యే విది యేఁటిదే
చలము నీకుఁ గలితే సాదించవలెఁ గాక
నిలిగి ముసుఁ గిడుటే నిష్టూరము గాదా॥ఈతడె॥
  
  
శ్రీవెంకటేశ్వరుఁడు చేరి కాఁగిలించుకోఁగా
యీవేళ సిగ్గు వడేవు యిఁకఁ దగునా
వేవేలు గలిగిన వెనకకె చెల్లుఁ గాక
భావించి కూడిన మీఁదఁ బచ్చి దొఁచదా॥ఈతడె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!