Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3256

ఈతఁడొక్కఁడే యన్నిటా నెన్నిక కెక్కినవాఁడు

రాగము: సాళంగనాట

ఈతఁడొక్కఁడే యన్నిటా నెన్నిక కెక్కినవాఁడు
చూతమురారో చక్కని రీతి గలవాఁడు॥పల్లవి॥
  
  
సారెకుఁ బుటమెగరి సాముచేసినవాఁడు
ఆరితేరిన చిప్పలహరికెవాఁడు
పోరి కొమ్ముదారతోడి పోటుబంటయినవాఁడు
చేరి రివులఁ జెండాడే చేకత్తులవాఁడు॥ఈతఁ॥
  
  
పొంచి యడుగడుగుకుఁ బొదలేవాఁడు
చెంచలించక పగలు సాదించేవాఁడు
పెంచి శరణంటేఁ గాచే బిరుదువాఁడు
మించి యెలువఁగరాని మేటి బలువాఁడు॥ఈతఁ॥
  
  
పరులనుఁ గడు సిగ్గు వరపించేవాఁడు
తొరలి తొక్కని చోట్లు దొక్కేటివాఁడు
సురలకు నేలికై సూడువట్టేవాఁడు
నిరతి శ్రీవేంకటాద్రి నెలకొన్నవాఁడు॥ఈతఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!