Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3289

ఈ యీ యీ యీ యీ యీ

రాగము: గుజ్జరి

ఈ యీ యీ యీ యీ యీ
యీ యీ యీరీతి నా గుణము నాయందే తగిలెను॥పల్లవి॥
  
  
మనస్సుననే నినుఁ దలఁచి మాటలఁ గొసరుదును వొక్కొకపరి
వినయముతో నీకు వేవేలు మొక్కులు మొక్కుదును వొక్కొకపరి
ఘనంబగు భక్తిని బయలుకౌఁగిట నలముదును వొక్కొకపరి
తనియక వేడుకతోను దైవమా నినుఁ బొగడుదును॥ఈయీ॥
  
  
జగత్తున నే నిను వెదకి సారెకు నవ్వుదును వొక్కొకపరి
పగటున నీ నామములు పాడుచుఁ జెలఁగుదును
తగులుచు నినుఁ బూజించి తగఁ బ్రియమునఁ జొక్కుదును వొక్కొకపరి
నిగమములను నిన్ను విని నీరజనాభా వెఱగందుదును॥ఈయీ॥
  
  
అంతట నీ మహిమ గని అటు నీ దాస్యమె కొరుదును వొక్కొకపరి
చెంతల నీ దాసులఁ జూచి సేవ సేసి నిను నడుగుదును వొక్కొకపరి
అంతరంగము శ్రీవేంకటేశ అలమేల్మంగతోఁ బొడచూపితివి
సంతసమున నే నీ పాదములకు శరణుచొచ్చి నేబ్రదికితిని॥ఈయీ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!