Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3291

ఈయఁగదవే వీడెమిప్పుడే నీ విభునికి

రాగము: కాంబోది

ఈయఁగదవే వీడెమిప్పుడే నీ విభునికి
మీ యిచ్చలే గుఱిగాక మేమెల్లా గుఱే(ఱా?)॥పల్లవి॥
  
మొదలనాపెకు నీకు మోహమే గుఱిగాక
మదమునఁ జిమ్మి రేఁగే మంకులు గుఱా
పొదిగొన్న లోలోని భోగములే గుఱిగాక
పెదవులమీఁదటి బీరాలు గుఱా॥ఈయ॥
  
ననుపున మీలోని నవ్వులే గుఱిగాక
వొనరఁ బెట్టుకొనిన వొట్లు గుఱా
కనుచూపులఁ జూచిన కాంక్షలే గుఱిగాక
కినిసిన బొమ్మల జంకెనలు గుఱా॥ఈయ॥
  
కూడిన కాఁగిటిలోని కూటములే గుఱిగాక
పాడితోడ నొండొరుల పంతాలు గుఱా
యీడై శ్రీవేంకటేశుకిటు నీవే గుఱిగాక
వోడక మేనిపై రేకలుంటేనే గుఱా॥ఈయ॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!