Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3310

ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది

రాగము: శ్రీరాగం

ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది
పావనుల హృదయమునఁ బ్రభవించుఁగాని॥పల్లవి॥
  
  
ఇమ్మయినపాపంబు లెన్నివలసినఁ బ్రాణి
సమ్మతంబున జేయఁ జాలుఁగా కేమి
కుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవును
నమ్మితలఁ చినవిష్ణునామంబుచేత॥ఈవి॥
  
  
కొదలేనిదురితములు కొండలునుఁ గోట్లును
చెదర కెప్పుడుఁ బ్రాణి చేయుగా కేమి
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను
హృదయంబు హరిమీఁద నుండినంతటను॥ఈవి॥
  
  
సరిలేని దుష్కర్మసంఘములు రాసులై
పెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁగాకేమి?
బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌను
తిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను॥ఈవి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!