Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3315

ఈ సుర లీ మును లీ చరాచరములు

రాగము: నాదరామక్రియ

ఈ సుర లీ మును లీ చరాచరములు
యీ సకలమంతయు నిది యెవ్వరు॥పల్లవి॥
  
  
ఎన్నిక నామము లిటు నీవైయుండఁగ
యిన్నినామముల వారిది యెవ్వరు
వున్నచోటనే నీవు వుండుచుండఁగ మరి
యిన్నిటాఁ దిరుగు వారిది యెవ్వరు॥ఈ సురలీ॥
  
  
వొక్కరూపై నీవు వుండుచుండఁగ మరి
తక్కిన యీరూపములు తా మెవ్వరు
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ
మక్కువ నుండువారు మరి యెవ్వరు॥ఈ సురలీ॥
  
  
శ్రీవేంకటాద్రిపై చెలఁగి నీవుండఁగా
దైవంబులనువారు తా మెవ్వరు
కావలిసినచోట కలిగి నీ వుండఁగ
యీవిశ్వపరిపూర్ణు లిది యెవ్వరు॥ఈ సురలీ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!