Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3343

ఉన్న వారిలోన నీవూ నొకతె వింతే

రాగము: సింధురామక్రియ

ఉన్న వారిలోన నీవూ నొకతె వింతే
మన్ననలు గలిగితే మాఁటలు నీ కేఁటికే॥పల్లవి॥
  
  
చేరి తమరమణుఁడు చెప్పినట్టు సేసేవారు
ఆరసి వెంగేలు వేరే ఆడవచ్చేరా
ఆరీతి నాతఁడే తమఅంకెలకు రాకుండితే
దూరుదురు మీరుదురు తుచ్చము నీ కేఁటికే॥ఉన్న॥
  
  
తక్కక తమపతుల దక్కఁ గొని నట్టివారు
తెక్కులను నమ్మక సాదించ వచ్చేరా
వొక్కట్టె వారె తమ వొడఁబాటుకు రాకున్న
చిక్కింతురు చొక్కింతురు చెనక నీ కేఁటికే॥ఉన్న॥
  
  
మచ్చిక తమవిభుని మరిగించినట్టివారు
నిచ్చలు నెన్నఁడై నా నేర మెంచేరా
యిచ్చల శ్రీవేంకటేశుఁ డెనసి నన్నిదె మీరె
మెచ్చింతురు హెచ్చింతురు మేకు లిఁక నేఁటికే॥ఉన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!