Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3344

ఉన్నవారిఁ దడవేనా వూరకె నేను

రాగము: వరాళి

ఉన్నవారిఁ దడవేనా వూరకె నేను
పన్ని యిట్టె తలపోసి భావించుకోవయ్యా॥పల్లవి॥
  
  
నీ యింతిపైఁ గోపించుట నీమీఁది వల పది
ఆయెడ వారిఁ దిట్టుట అది నీనుతి
చేయెత్తి సేసినచేఁత చెక్కులు నీకు నొక్కుట
పాయపు విభుఁడ ఇట్టె భావించుకోవయ్యా॥ఉన్న॥
  
  
వెంగెము నీసతి నాడుట వేడుక నీమీఁదిది
కంగి యాపె కలుగుట కైకొంట నిన్ను
కొంగువట్టి తీసుటెల్లా కూరుములే కొసరుట
పంగెన గా దిపు డిట్టె భావించుకోవయ్యా॥ఉన్న॥
  
  
సారె నీకాంత దూరుట సమ్మతి నిన్నుఁ జేసుట
వారిఁ దప్పకచూచుట వాడికె నీది
యీరీతి శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
భారము వేసుటగాదు భావించుకోవయ్యా॥ఉన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!