Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3351

ఉపకారమింతేకాని వొరటుగాదు

రాగము: దేసాక్షి

ఉపకారమింతేకాని వొరటుగాదు
కపటాలు మాని సతిఁ గాఁగిలించవయ్యా॥పల్లవి॥
  
  
మంకుగాదు చెలియ నీమనసు చూచేనంటా
వుంకువ సిగ్గులతోడ నూరకున్నది
సంకెగాదు నిన్నుఁ దనచన్నులు నాటించితేను
అంకెఁ గుమ్మెలయ్యీనంటా నట్టె మూసెఁ బయ్యద॥ఉప॥
  
  
తిట్టుగాదు నీగుణము తెలుసుకొనవలసి
బెట్టీమాటలనిన్నుఁ బెదవులను
ఱట్టుసేయదాపె నిన్నాఱడిఁ బెనఁగకున్న
దిట్టతనము నేరక దిగేవంటాను॥ఉప॥
  
  
గబ్బితనములుగాదు కాఁగిలించి పట్టినిన్ను
తబ్బిబ్బుగాకుండ రతిఁదనిపేనంటా
అబ్బురపు శ్రీవేంకటాధిప నిన్నుఁగలసె
జొబ్బిలఁ బ్రేమము నీకుఁ జూపేనంటాను॥ఉప॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!