Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3354

ఉపచరించవయ్యా వువిదలను

రాగము: నాదరామక్రియ

ఉపచరించవయ్యా వువిదలను
వుపమలతోడనే వొడలు మోపీని॥పల్లవి॥
  
జలజలఁ జెమటలు చన్నుల తుదలఁ గార
అలసి గందము వూసీ నతివ నీకు
మలకల నెరివేణి మఱి వీఁపునఁ బొలయ
తలపోఁత గతులఁ బాదములో త్తీని॥ఉప॥
  
వెడవెడ నిట్టూర్పులు విసర ముక్కునవెంట
జడిసి సురటి వీచీ సారెకు నేఁడు
తొడిఁబడఁ జెమటలు తొటతొటఁ బైఁ బడఁగ
జడిగొన మాటల సరసమాడీని॥ఉప॥
  
కలసి వొండొంటితో కంకణా లొరయఁగాను
చెలఁగి కాఁగిటఁగూడీ శ్రీవేంకటేశా
కులికి కులికి కొనగోరి గురులు సోఁకఁగ
పలురతుల చవులు పచారించీని॥ఉప॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!