Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3399

ఊడిగపువారినేల వొంటి నాసలు రేఁచేవు

రాగము: రామక్రియ

ఊడిగపువారినేల వొంటి నాసలు రేఁచేవు
తాడుపడి లోలోనే తమకించి రతికి॥పల్లవి॥
  
పట్టిన కాళాఁజియాపెపైఁ జేయి వేసుకొని
వొట్టుచుఁ దమ్ములమట్టే వుమిసేవు
గుట్టున నందుకు నింతి గుబగుబఁ జెమరించి
నెట్టుకొని మోహించి నివ్వెరఁగు నొందెను॥॥
  
అడపము చెలిమీఁదనట్టె పాదాలు చాఁచుక
అడరుచు నిక్కి యాకులందుకొనేవు
తడఁబడి యాచెలి తనువెల్లాఁ బులకించి
నిడువాలుఁగన్నులను నీమోముచూచెను॥॥
  
గిండివట్టే యాపె కుచగిరులపై నొరుగుక
అండనే చల్లని పన్నీ రారగించేవు
దండిగా శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
మెండుగా తానూఁ గూడి మెచ్చులెల్లా మెచ్చెను.॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!