Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3440

ఊరకుండవే చెలియ వొద్దికతో రమణుఁడు

రాగము: కాంబోది

ఊరకుండవే చెలియ వొద్దికతో రమణుఁడు
చేరి తానే వలెనంటే సేవ సేసేఁగాని॥పల్లవి॥
  
  
సుసరాననేవచ్చినచుట్టరిక మింపుగాక
కొసరఁబోతే మనసు గొంటుడదా
ముసిముసినవ్వులతో ముదులకించేవట
పిసికిపిసికాడితే పిప్పిరేఁగదా॥ఊర॥
  
  
వరుతోననిచినవలపు చవౌఁగాక
వొరసి పెనఁగితే మే నుప్పుఁ రేగదా
సరసపుఁ జేఁతలలో సారేకుఁ జల్లేటిచూపు
తిరిగితిరిగి చూచితేఁ దెల్లవారదా॥ఊర॥
  
  
కదిసి బిగించితేను కాఁగిలి వేడుకౌఁగాక
వదలితే నడియాస వలఁబెట్టదా
యిదె కూడె శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగను
పదరితే సమరతి పచ్చిదేరదా॥ఊర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!