Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3457

ఊరకె గుట్టు సేసుక వుండనీ వయ్య

రాగము: ముఖారి

ఊరకె గుట్టు సేసుక వుండనీ వయ్య
పేరఁ బెట్టినటువంటి పెరుగె మా జరగు॥పల్లవి॥
  
  
గొల్లవారిమాఁటలు గోనుఁ బువ్వువాటులు
కెల్లు రేఁచి మమ్ముఁ బలికించకు వయ్య
కొల్లలాడే బాగులు గొడ్డుఁబుల్లతేగెలు
నొల్లనొల్లమి విడే లుంగిటయ్యీ మాకును॥ఊరకె॥
  
  
చిత్తములో మంకులు చేతు కెల్లా అంకులు
బత్తితో మమ్ము బలిమిఁ బట్టకు వయ్య
గుత్త మైనమేడలు కొమ్మిమాకునీడలు
కొత్త సున్నపుటిండ్ల కొర యాల మాకును॥ఊరకె॥
  
  
తొలుతే మా కాఁపురాలు తోఁపుతిత్తి దాఁపురాలు
తిలకించి మా వొడి సోదించకు వయ్య
నెల వైశ్రీవెంకటేశ నీవు మమ్ముఁ గూడితివి
మొలకలపులకలు మోపు లాయ మాకును॥ఊరకె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!