Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3459

ఊరకె జంకించెనంటా నుప్పతించేవు

రాగము: సామంతం

ఊరకె జంకించెనంటా నుప్పతించేవు
గారవపుదాని కెంత గడిఇంచేవయ్యా॥పల్లవి॥
  
  
చెప్పిన నీ మాఁటలెల్లాఁ జెవు లాలకించి వినె
కొప్పు వట్టి తీసితే మక్కువ జేకొని
కప్పుర విడె మిచ్చితే గక్కనఁ దా నందుకొనె
యిప్పు డింతకెంటెఁ జెలి యేమి సేసునయ్యా॥ఊర॥
  
  
పేరుకొని పిలిచిరతే ప్రియముతో నూఁకొనె
సారె నీవు నవ్వితేను సమ్మతించెను
చేరి నీవు చెనకితే చెతులెత్తి నీకు మొక్కె
యీరీతి దా నింతకంటె నేమ సేసునయ్యా॥ఊర॥
  
  
చెక్కు నీవు నొక్కితేను చెంగలించి వొడఁబడె
గక్కనఁ గాఁగిలించితే కరఁగె మతి
చక్కని శ్రీవేంకటేశ సతినిట్టె యేలితివి
యెక్కువాయ నింతకంటె నేమి సేతునయ్యా॥ఊర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!