Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3483

ఊరకే నీ వలలఁ జిక్కున్న దానను

రాగము: భైరవి

ఊరకే నీ వలలఁ జిక్కున్న దానను
తేరకొన నాపాలికి దిక్కునీవే సుమ్మీ॥పల్లవి॥
  
  
నీవు విచ్చేసినదాఁకా నేఁ జింతించితిఁ గాని
పూవువలెఁ బట్టి నిన్ను భోగించనేర
వేవేలుఁ జెలులచేత విన్నవింపించితిఁ గాని
కావిరి నిన్ను సాదించి రట్టుకొనే దేదో॥ఊర॥
  
  
నిమాట విన్నదాఁకా నే వేగిరించితిఁ గాని
దోమటి చె చాఁచి నిన్నుఁ దొడుక లేదు
వోముచుఁ బైకొని నీ వొద్దికి వచ్చితిఁ గాని
ఆ మీఁదట్టిను లడిగే దేదో॥ఊర॥
  
  
గక్కన నిన్నుఁగూడి కన్నుల నవ్వితిఁ గాని
తక్కక నీ యాస లేమి దప్పించనైతి
వొక్కటైతి మిద్దరము వొరసి శ్రీవేంకటేశ
మిక్కిటి నిన్ను మెప్పించి మెరసే దేదో॥ఊర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!