Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3487

ఊరకే నోరు మూసుక వుండలేము చూచిచూచి

రాగము: రామక్రియ

ఊరకే నోరు మూసుక వుండలేము చూచిచూచి
చేరి నేము చెప్పినట్లు సేయవయ్య నీవు॥పల్లవి॥
  
  
పాయకురమణి గాన పంతానకే పెనఁగీని
చేయివట్టి తీసినా చేరఁగరాదు
ఆయము సోఁకినమాట ఆడితే నేకేమాయ
వోయయ్య నీ కోపమున కోపమయ్య నేము॥ఊర॥
  
  
సిగ్గువడేసతిగాన శిర సట్టె వంచీని
వొగ్గి పేరఁ బిలిచిన నూరకున్నది
దగ్గరి నీవు పైకొంటే తగవు నీకేమీ దప్పు
వెగ్గళించేరాజసము వెఱతుమయ్యా॥ఊర॥
  
  
కాఁగినరమణిగాన కడు బడలియున్నది
ఆఁగి నేమేమిచెప్పినా నడ్డమాడదు
దాఁగక శ్రీ వేంకటేశ తరుణిఁ గూడితి నీవే
యేఁగుఁబెండ్లి ఆయ నేఁడు యిమ్మకొంటివయ్యా॥ఊర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!