Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3501

ఊరకే లోనౌదువా వుడిబడి వారికెల్ల

రాగము: ఆహిరినాట

ఊరకే లోనౌదువా వుడిబడి వారికెల్ల
మేరమీరి యాపెనే మెచ్చవలెనయ్యా॥పల్లవి॥
  
  
మెల్లనిమాటలాడి మెలుఁత నిన్ను భ్రమించె
చల్లనినవ్వులు నవ్వి సాదించెను
మొల్లలతురుము చూపి సుదతి నిన్నుఁ జొక్కించె
చెల్లునయ్యాఆపె మేమిసేసినాను నిన్నును॥ఊర॥
  
  
సోయగపుచూపు చూచి సుదతి నిన్నుఁ జొక్కించె
ఆయాలు చన్నులనొత్తి అసరేఁచెను
పాయపుమదము చిమ్మి భావమెల్లాఁ గరఁగించె
నోయంతవాని నాపె నేర్చునయ్యా పొందను॥ఊర॥
  
  
వేవేలు చేఁతలు చేసి వెలఁది నిన్ను మొప్పించె
చేవదేరే రతులను చిక్కించెను
యీవేళ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
ఆవేళ కాపె రాజు అవునయ్య నీకును॥ఊర॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!