Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3538

ఎక్కడ పరాకు నీకు నెఱఁగరాదా

రాగము: సాళంగనాట

ఎక్కడ పరాకు నీకు నెఱఁగరాదా
నిక్కము వలపించే యెన్ని కలెల్లా నున్నవి॥పల్లవి॥
  
  
చెప్పఁబూఁచీ పిగ్గు లాపె చెవి యొగ్గరాదా
తప్ప కిట్టె కాఁగిలించేతమి వున్నది
చిప్పిల నేఁటికి దీరీఁ జేయీ చాఁచరాదా
వుప్పతిల్లఁ గరఁగించేవుద్యోగ మున్నది॥ఎక్క॥
  
  
తేనేమోవి యియ్యఁబూఁచీఁ దెరవేయరాదా
ఆనించి నిన్ను మెప్పించేఆస లున్నవి
నానవేసీ సరసము నవ్వు నవ్వరాదా
తానకమై నినుఁబొఁ(బొం?) దేతలపోఁత లున్నవి॥ఎక్క॥
  
  
ప్రేమ రతిఁ గూడఁబూఁచీఁ బిలువఁగరాదా
నీమనసురప్పించేనేరు పున్నది
యీమేర శ్రీవేంకటేశ యెనసితివి నన్ను నీ
వామగువఁ గూడితివి ఆగుఱుతు లున్నవి॥ఎక్క॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!