Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3569

ఎక్కడి పరాకుననో యిందాఁకా నుండెఁ గాక

రాగము: ముఖారి

ఎక్కడి పరాకుననో యిందాఁకా నుండెఁ గాక
మక్కువ నాపై బత్తి మానలేఁడె వాఁడు॥పల్లవి॥
  
  
పాయరాని వలపులు పక్కనఁ దలఁచుకొంటే
రాయా మనసు గరఁగ కేమే
వో యమ్మలాల నావుంగరము చూపరమ్మ
వేయేల తా నిప్పుడే విచ్చేసీ నీడకే॥ఎక్కడి॥
  
  
వూనినట్టిసరసాలు వూహించుకొంటేను
మానా దేహము తమకించ కేమే
మానినులాల వొక్కమాఁట విన్నవించరమ్మ
తానె వచ్చి నన్నుసంతస మందించీనే॥ఎక్కడి॥
  
  
నేదదేరే చనవులు చిత్తమునఁ దగిలితే
దూదేవయ సేమి వూదితేఁ బోను
ఆదెస మండెమురాయఁ డైన శ్రీవెంకటనాథుఁ
డాదరించి నన్నుఁ గూడె నతివమోహముననూ॥ఎక్కడి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!