Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3614

ఎగసక్కేలకే వచ్చీ నెంత బలువు

రాగము: ముఖారి

ఎగసక్కేలకే వచ్చీ నెంత బలువు
తగనిచేతఁలు చేసి తమకించీఁ దాను॥పల్లవి॥
  
  
వేళగాని వేళ వచ్చి వేలఁ దలుపు మీటుచు
లే లెమ్మని పేరునఁ బిలిచీనే తాను
పాలుమాలి నిద్దురతో పవళించి నే నుండఁగా
వోలి సోరణగండ్ల నుంట వింట వేసీనే॥ఎగ॥
  
  
వాడలు దిరిగి వచ్చి వాకిటఁ దాఁ గూచుండి
ఆడకు నన్ను రమ్మంటా నానవెట్టీనే
వోడక నే నూరకుంటే వొద్దనున్న చెలులచే
వీడెము దెప్పించుక వే వేగ లోను చొచ్చేనే॥ఎగ॥
  
  
వింతవాసనలతోడ విచ్చేసి నన్నుఁ గౌఁగిట
యెంత వొల్లా నన్న మానఁ డెటు గూడెనే
పంతపు శ్రీవేంకటాద్రిపతి నన్ను భ్రమయించి
మంతనానఁ గోప మెల్ల మఱపించె నిదివో॥ఎగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!