Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3619

ఎగ్గుపట్టరాదు మరి యెరిఁగిన జాణఁడవు

రాగము: శంకరాభరణం

ఎగ్గుపట్టరాదు మరి యెరిఁగిన జాణఁడవు
సిగ్గరిది నీ దేవులు చిత్తగించవయ్యా॥పల్లవి॥
  
  
కాంతలకు నొయ్యారపుగర్వమే బంగారము
వింతలైన మాటలవెంగేలు చవి
సంతోసపుఁజూపులసళుపులే మోహనము
మంతనాననుండి చల్లేమచ్చికలే యింపులు॥ఎగ్గు॥
  
  
తగుఁ బయ్యెదచన్నులదాఁపరాలే తరితీపు
మొగములో చిరునవ్వు మొలకే ఆస
సొగసైన కరములసోఁకులే ఆనందాలు
పగటు బొమ్మజంకెలే భావజునిసిరులు॥ఎగ్గు॥
  
  
సందడిచెనకులు సంసారఫలములు
కందువమోవిసన్నలు కడుఁ బండుగ
అందపు శ్రీవెంకటేశ అలమేల్ మంగకు నీకు
మందెమేళాలు రతులమర్మపు ముచ్చటలు॥ఎగ్గు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!