Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3639
ఎచ్చరి బ్రదుకవలె యెఱిఁగినవారికి
రాగము: సామంతం
ఎచ్చరి బ్రదుకవలె యెఱిఁగినవారికి | |
తెచ్చుకొనేమంటే బట్టి తేరాదు కాలము | ॥పల్లవి॥ |
చేసినపుణ్యము దక్కు చెల్లుబడి గల నాఁడే | |
వేసాల సంపద లెల్ల వెంట రావు | |
ఆసలాసలనుఁ జిక్కి యవి దనవిగాఁ జూచి | |
మోసపోతే మఱి లేదు మొనయడు జన్మము | ॥ఎచ్చరి॥ |
కైకొన్నవ్రత మీడేరు కాయముతో నున్నప్పుడే | |
కాకరిసంసార మిది కాణాచి గాదు | |
లోకమువారలఁ జూచి లోలుఁడై చవులకు లాచి | |
కాకైతే మఱి లేద గరిపడు జన్మము | ॥ఎచ్చరి॥ |
సర్వము సాధించవచ్చు జ్ఞానముతో నున్నవాఁడే | |
నిర్వహించఁబోతే మఱి నిలుపరాదు | |
వుర్వి శ్రీవేంకటేశ్వర వూహించ నేరక | |
గర్వియైతే మఱి లేదు కడ మవును జన్మము | ॥ఎచ్చరి॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు