Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3674

ఎటువంటి పొందులో మీ యిద్దరికిని

రాగము: కేదారగౌళ

ఎటువంటి పొందులో మీ యిద్దరికిని
తటునక మాకు నేఁడు తారుకాణ లాయను॥పల్లవి॥
  
  
ముసి ముసి నవ్వులతో ముచ్చట చెప్పీ నాకె
విసుగక చెవులారా వినవయ్యా
కొసరుచుఁ జెలి నిన్నుఁ గొంగువట్టి పెనఁగీని
సుసరాన లోనైతే సూటికి రావయ్యా॥ఎటు॥
  
  
సిగ్గులు వడక నిన్నుఁ జెక్కు నొక్కి వేఁడు కొనీ
దిగ్గన నందుకు సమ్మతించవయ్యా
వెగ్గళపుఁదమి తోడ వీడెము నీకిచ్చీని
వొగ్గి యందుకొని సేవవొప్ప గొనవయ్యా॥ఎటు॥
  
  
వెక్కసముగా నీకు వినయాన మొక్కీని
చొక్కుచు మోము దప్పక చూడవయ్యా
యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
తక్కక యాకె చెనకీ తప్పించుకొవయ్యా॥ఎటు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!