Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3677

ఎటువంటి భాగ్యమో యీపెకు నేఁడు

రాగము: సామంతం

ఎటువంటి భాగ్యమో యీపెకు నేఁడు
తటుకనఁ దాను దొరతనము మెరసెను॥పల్లవి॥
  
  
చద్దికి వేఁడికి నీవు సారెసారె వేఁడుకోఁగా
పెద్దరికమున కాపె బిగిసీ నీతో
యిద్దరు నిద్దరేయని యీడనున్నసతులు మీ-
సుద్దులు వొగడుకొంటా చూచేరు మిమ్మును॥ఎటు॥
  
  
వుమ్మగిలుఁ జెమటతో వొడివట్టి తియ్యఁగాను
యెమ్మెలకే పెనఁగీ నిట్టె నీతో
అమ్మరో నీవాకెకు అరవి సమత్తువేమో
చిమ్మిరేఁగి తరితీపు చిందీ మీవల్లను॥ఎటు ॥
  
  
నెట్టనఁ దమకమున నీవు గాఁగిలించుకోంగా
బట్టబయలీఁది యాకె భ్రమసీ నీతో
ఇట్టె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
గట్టిగా నన్నేలితివి కంటిమి మీపొందులు॥ఎటు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!