Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3688

ఎటువంటి మోహంబు యెటువంటి పరిణతలొ

రాగము: శ్రీరాగం

ఎటువంటి మోహంబు యెటువంటి పరిణతలొ
అటువంటి సతి పొందు లవి నీకె తగురా॥పల్లవి॥
  
  
చక్కని జవరా లొకతె జారెడికొప్పొకచేతఁ
జెక్కుచు సన్నపు నవ్వు చిలికి చిలికి
చెక్కునఁ జెదరిన కమ్మం జెమటల తావులను
చొక్కుచు నిన్నరగంటం జూచె నెవ్వతెరా॥ఎటు॥
  
  
గద్దరి కన్నుల కలికి కమ్మని చల్లగాలి
అద్దిన దేహము తోడ నలసి యలసి
ముద్దుల రెప్పలు దెరచి ముందటి నీ తనవలపు
సుద్దులు దెలుపుచు నిన్నుం జూచె నెవ్వతెరా॥ఎటు॥
  
  
కొండల రాయండ నీ కొమరైన చెలిచన్నుఁ
గొండల నీ కెంగేలం గులికి గులికి
నిండిన కౌఁగిటిలోన నీవుం దానుం గలశుండి
వుండినటువలెం గూడి వుండె నెవ్వతెరా॥ఎటు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!