Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3694

ఎటువంటి రౌద్రమో యెటువంటి కోపమో

రాగము: ఆహిరి

ఎటువంటి రౌద్రమో యెటువంటి కోపమో
తటతట నిరువంక దాఁటీ వీఁడే॥పల్లవి॥
  
  
తోరంపుఁ బెనుచేతుల మల్లచఱచి
దారుణలీలఁ బెదవు లవుడుకఱచి
కారించి చాణూరుఁ గడుభంగపఱచి
వీరుఁడై యెముకలు విఱచీ వీఁడే॥ఎటు॥
  
  
పిడుగడచినయట్టు పెడచేత నడిచి -
పడనీక పురములోపలఁ జొరఁబొడిచి
తొడిచి చాణూరు నెత్తుక దయవిడిచి
వడివెట్టి నెత్తురు వడిచీ వీఁడే॥ఎటు॥
  
  
బుసకొట్టుచును వూరుపులఁ జెమరించి
మసిగాఁగ బెదపెదమల్లుల దంచీ-
నెసఁగి శ్రీతిరువేంకటేశుఁడై మించి
ముసిముసినవ్వుల ముంచీ వీఁడే॥ఎటు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!