Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3740

ఎట్టు గడించుకొంటివే ఇవి చక్కఁదనమంటా

రాగము: శంకరాభరణం

ఎట్టు గడించుకొంటివే ఇవి చక్కఁదనమంటా
చుట్టములు గావే అవే సూడిబంట్లు॥పల్లవి॥
  
  
తామెరలవంటివేమో తరుణి నీకన్నులు ఆ-
తామెరలే మరునికి తగ బాణాలు
సోముని వంటిదే నీసొఁపైన మొగము ఆ-
సోముఁ డాతనిఁ గలసి జోడౌతెఱఁగవా॥॥
  
  
జక్కవల బోలినవి తి నీకుచములు ఆ-
జక్కవలే మరునికిఁ జనవరులు
మిక్కిలితేంట్లఁ బోలె మేలిమి నీకురులు
పక్కన నాతని కవి బంట్లౌతెఱగవా॥॥
  
  
చిగురుఁ బోలినదె చెలియ నీమేను ఆ-
చిగురేపో మరునికిఁ జేకత్తులు
నగుతా శ్రీవేంకటాద్రినాయకునిఁ గూడితివే
తగ నీతఁడే యాతనితండ్రౌ తెఱఁగవా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!