Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3813

ఎట్టుసేసిన నీచేఁత కెప్పుడు లోనే నేము

రాగము: వరాళి

ఎట్టుసేసిన నీచేఁత కెప్పుడు లోనే నేము
బట్టబయలీఁదనేల భాగ్యము నీచేతిది॥పల్లవి॥
  
  
చెలువుఁడవు నీ వేమి చెప్పిన వినేముగాక
చలమరితనమేల సాదించనేల
వలచినవారము వద్దనే వుండేముగాక
అలిగి పండుండనేల అవుఁగాదననేల॥ఎట్టు॥
  
  
యేలినవాఁడవు నీయిచ్చ మెలంగేముగాక
జోలిమాట లాడనేల సొలయనేల
నీలోని వారము నిండుకవుండేముగాక
జాలి నీకు రేఁచనేల జంకించనేల॥ఎట్టు॥
  
  
శ్రీవేంకటేశ్వరుఁడవు చేకొని మొక్కేముగాక
పూవుల వేయఁగనేల పొనుంగనేల
యీవేళ నలమేల్ మంగ నిటు నీకాఁగిటిదాన
వేవేలుగాఁ గూడితివి వేసరించనేల॥ఎట్టు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!