Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3815

ఎట్టు సేసినా నమరు ఇంతటి దొరవు నీవు

రాగము: ముఖారి

ఎట్టు సేసినా నమరు ఇంతటి దొరవు నీవు
గట్టువాయతనమేల కరుణించరాదా॥పల్లవి॥
  
  
చెలి పనివడి నీతో చెవిలోన విన్నవించఁగా
మలసి వేరొకతెతో మాటలాడేవు
యెలమి నాపె నిన్ను నేమీ ననఁజాలక
సెలవుల నవ్వు నవ్వీఁ జిత్తగించరాదా॥ఎట్టు॥
  
  
చివ్వన నీసతి నీచేతికిఁ గానుకియ్యఁగా
అవ్వలియాపె నుంగర మడిగేవు
నివ్వటిల్ల నిందుకుఁగా నెమ్మి నందాలుసేసుక
పువ్వులవేసీ నిన్నుఁ బొందుచూపరాదా॥ఎట్టు॥
  
  
అసల నలమేల్మంగ అట్టె కాఁగిలించుకోఁగా
నేసవెట్టే విందరిపై శ్రీవేంకటేశ
యేసుద్దులూఁ దడవక యిన్నిటాఁ బొగడె నిన్ను
లాసి నీరతులకు లాలించరాదా॥ఎట్టు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!