Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3912

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: దేసాళం

ఎదురుబడి సొలయ నిఁకనేలయ్యా
ముదముతోడ నీకు మొక్కేమయ్యా॥పల్లవి॥
  
  
వనితల నందరిని వలపించ నేరుతువు
పెనుపెట్టి మచ్చికులు పెంచనేర్తువు
మనసురా నన్నిటాను మాటలాడ నేరుతువు
పనితోడ నేమెల్లా బదికితిమయ్యా॥॥
  
  
క్రియలు దెలిపి తమి కెరలించ నేరుతువు
నయములుగా కడునవ్వనేర్తువు
ప్రియములు చూపి యాస పెచ్చురేఁచ నేరుతువు
నియతాన నీ కృపను నెలకొంటిమయ్యా॥॥
  
  
విందు చెప్పి మోవియిచ్చి వెలయించ నేరుతువు
అంది కాఁగిలించి కళ లంటనేర్తువు
చెందితివి నన్ను నిట్టె శ్రీ వేంకటేశ్వర
మందలించి నిన్ను నేము మరఁగితిమయ్యా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!