Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3927

ఎనసిన యాకెతో నీకింత యేఁటికి

రాగము: కేదారగౌళ

ఎనసిన యాకెతో నీకింత యేఁటికి
వెనుకొని నావెంటనె విచ్చేయవయ్యా॥పల్లవి॥
  
  
పలికినట్టనెపో పంతము
చలిమి బలిమిగల సతులకు
తలఁచినయట్లనె తగులము
వలపులు నెలకొన్నవారికెల్లాను॥ఎన॥
  
  
చేసినవెల్లాఁ జెల్లు చేఁతలు
బాలు నమ్మినయట్టి పడఁతులకు
ఆసపడిన కోరిక లబ్బునపుడె
సేసవట్టుకుండినట్టి చెలులకును॥ఎన॥
  
  
చూచినట్లనెవచ్చు సూటులు
యేచి కూడిన మీవంటిద్దరికిని
చేచేత శ్రీవెంకటేశ చెలి యలమేల్‌మంగ
లాచి నట్లనె మించె లావణ్యాలు॥ఎన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!