Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3945

ఎన్నడును గోపగించ విందుముఖి నీవిట్లా

రాగము: శ్రీరాగం

ఎన్నడును గోపగించ విందుముఖి నీవిట్లా
విన్నని వదనమెల్లా వింతలాయ నిపుడు॥పల్లవి॥
  
  
ఇంతలోని పనికిఁగా నెంత చేసినాఁడవు
కాంత నిన్నటినుండి కనుమూయదాయను
బంతికూటి సతులెల్లా బలుమారు నేఁపగా
చింతతోఁ బళ్ళెము మీఁద జెయి చాఁచదాయెను॥ఎన్న॥
  
  
ఏమిసేయఁబోయి నీవుయేమి సేసినాఁడవు
సాముకు విచ్చేయదు జవరాలు నేఁడు
దోమతెర మంచముపై తురుము వీడఁగను
తామసించి లేవదిదె తల నొచ్చీననుచు॥ఎన్న॥
  
  
ఎవ్వరిని దూరవచ్చు నెవ్వరున్నారిఁకను
పువ్వు సజ్జమీఁదఁ గాఁగె పొలఁతికి దేహము
రవ్వగ వేంకటగిరి రమణ నీ కౌఁగిటఁ
బవ్వళించి యింతలోనె పరవశమందెను॥ఎన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!