Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3955
కర్త :: తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎన్ని చేఁతలదానవే ఇన్నిటా నీవు | |
విన్న కన్న జాడ గాదు వెరగయ్యీ మాకు | ॥పల్లవి॥ |
మొక్కి కొలువుసేసేవు ముందటనుండి పతితో | |
మక్కళించి మక్కళించి మాటలాడేవు | |
ఒక్కవచన్ను లొరయ సారెఁ బాదాలొత్తేవు | |
నిక్కి వలపులు చల్లనేరుతువే నీవు | ॥॥ |
సెలవుల నవ్వేవు సిగ్గువడ కాతనితో | |
సొలసి సొలసి మేను సోఁకించేవు | |
తళుకుఁ జూపులఁ జూచి దండఁ గూచుండవచ్చేవు | |
యెలయింప జాణవైతి విపుడే నీవు | ॥॥ |
కూరిమి శ్రీవేంకటేశుఁ గొనచూపులనుఁ జూచి | |
చేరి చేరి వూడిగాలు సేయవచ్చేవు | |
యీరీతి నన్నీతఁ డేలె యే నలమేల్మంగను | |
తారుకాణలాయ మంచిదానవే నీవు | ॥॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు