Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3977

ఎన్నిరూపులైనాఁ జూప నితఁడే నేర్చు

రాగము: లలిత

ఎన్నిరూపులైనాఁ జూప నితఁడే నేర్చు
మున్నే యనంతావతారములవాఁడు గనక॥పల్లవి॥
  
  
పన్నీటిమజ్జనవేళ భావించి చూచితేను
మిన్నక నాభికిఁ గిందు మీనుసోగయై
మిన్నేరుపైఁ దొరుగఁగా మించి యెదురెక్కి నిలు
చున్నమచ్చావతారమై వున్నాఁడు దేవుఁడు॥ఎన్ని॥
  
  
మిక్కిలి కప్రకా పామీఁద నిండాఁ జాఁతఁగాను
చక్క నాల్గు చేతులతో సర్వేశ్వరుఁడు
తక్కక శుక్లాంబరధరుఁడైన విష్ణుఁడే
పక్కనఁ దా నని చెప్పి ప్రత్యక్షమై వుండెను॥ఎన్ని॥
  
  
సాసగఁగఁ బుళుకాపున నల్లనగుమేన
పసిఁడి యలమేల్మంగపైఁ గటుక
అసమున రుక్కిణిఁ బెండ్లాడే గోవిందునివలె
వెస శ్రీవేంకటేశుఁడు వెలయించె నిపుడు॥ఎన్ని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!