Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3999

ఎన్నేసి విద్యలు నేర్చె నీ రమణి

రాగము: తెలుఁగుఁగాంబోది

ఎన్నేసి విద్యలు నేర్చె నీ రమణి
చెన్నుమీరె నిన్నిటాను చిత్తగించవయ్యా॥పల్లవి॥
  
  
వనితచెమటలనె వానలు గురిసీ నదె
నినునవ్వులనె వెన్నెలగాసీని
పనులుసేసేవూర్పుల పయ్యరగాలి విసరి
చెనకీ నీదేవులు చిత్తగించవయ్యా॥ఎన్నో॥
  
  
విరహపువేడుక వేసఁగియెండలు గాసీ
సొరిఁది సిగ్గులనే మంచులు గప్పీని
వరుస మోవితేనెల వసంతకాలము చూపీ
సిరుల నీవేడుకలు చిత్తగించవయ్యా॥ఎన్నో॥
  
  
కందువచూపులనే కడుమెఱుఁగులు చల్లీ
అందపురతులనే వియ్యము లందీని
యిందుకె శ్రీవేంకటేశ యేలితి వీకెను నేఁడు
చిందీ నదె తరితీపు చిత్తగించవయ్యా॥ఎన్నో॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!